ఈతరంభారతం న్యూఢిల్లీ అక్టోబర్ 31:
______________________________
ప్రపంచంలోనే అత్యంత సవాలుతో కూడిన విమానాశ్రయాల్లో ఒకటి.. *భూటాన్లోని పరో ఎయిర్పోర్ట్!* చుట్టూ ఎత్తైన పర్వతాలు.. అత్యంత క్లిష్టమైన ల్యాండింగ్.. ఇదే భూటాన్లోని పరో విమానాశ్రయం ప్రత్యేకత! సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న పర్వతాల మధ్య నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్లో విమానాన్ని ల్యాండ్ చేయడం అంత సులభం కాదు. రన్వే చివరి క్షణాల్లోనే కనిపించే పరిస్థితులు ఉండటంతో పైలట్లు అత్యంత నైపుణ్యంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక్కడ విమానాలను ల్యాండ్ చేయడానికి ప్రత్యేక శిక్షణ, అనుభవం తప్పనిసరి. అందుకే పరో ఎయిర్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్లిష్టమైన విమానాశ్రయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.మరి ఇలాంటి ఎయిర్పోర్ట్లో విమాన ప్రయాణం చేయడానికి మీరు సిద్ధమేనా?















