ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 1 :
_________________________________
మల్కాజిగిరి, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన పోలీసులు.. అక్రమ అండాల (Oocyte) సేకరణ, వాణిజ్య విక్రయాల రాకెట్‌ను గుర్తించారు. ఈ కేసులో 8 మందిని అదుపులోకి తీసుకుని, 43 మంది మహిళలను రక్షించారు.వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలకు డబ్బు ఆశ చూపి, అండాల సేకరణ ప్రక్రియ కోసం హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంలో మహిళలను ప్రలోభపెట్టి నియమించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.మల్కాజిగిరి సీపీ బి. సుమతి, ఐపీఎస్ పర్యవేక్షణలో బేగంపేట, సరూర్‌నగర్ పోలీసులు SOT బృందాలతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. కేసులో మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.















