ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 1:
శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్ర విలసిత బాసర శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమం ఆధ్వర్యంలో చిక్కడపల్లి త్యాగరాసభలోని కళాదీక్షితుల కళావేదికలో అత్యంత వైభవముగా విశిష్ట సేవా పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం జరిగినది. సిద్ధాశ్రమ వ్యవస్థాపక ty yg అధ్యక్షులు శివశ్రీ నిర్మల అంబికానాధ శర్మ సంధ్య దంపతులు డాక్టర్ అనంతలక్ష్మి, డాక్టర్ శంకర్ నారాయణ , అశోక్ కుమార్, , నడింపల్లి యమునా పాఠక్ ఇవటూరి హరిణి, క్రొవ్విడి గణేష్ , కాశీనాథుని నివాస్, తాడికొండ విజయ్ కుమార్, లకు విశిష్ట సేవా పురస్కార అందజేసినారు. డాక్టర్ తులసి వెంకట రమణాచార్యులు మరియు మూర్తి శ్రీదేవి సభా కార్యక్రమం నిర్వహించారు .ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంతలక్ష్మి మరియు పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల సమయంలో బాసర క్షేత్రములో భక్తుల సహకారంతో కోటి పార్థివలింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిర వ్యవస్థాపక అధ్యక్షులు శివశ్రీ నిర్మల అంబికానాథ శర్మ సంధ్య దంపతుల ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం జూన్ 26 నుండి జూలై 7 వరకు 12 రోజులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమాలు, మరియు రోజుకు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం చాలా అభినందనీయమని వక్తలు కొనియాడినారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కర గోడ పత్రికను ఆవిష్కరించినారు. మరియు ఈ సందర్భంగా గోదావరి పుష్కర అన్నదానబి కమిటీ సభ్యులుగా 32 మందిని ఎంపిక చేసుకొని వారికి కూడా విశిష్ట సేవా పురస్కారాలు అందజేశారు















