EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మహిళల అండాల అక్రమ వ్యాపారంపై సమగ్ర దర్యాప్తు జరపాలి!

ఈతరం భారతం తేదీ: 01.11.2026 స్థలం: ఖమ్మం

_________________________________________

హైదరాబాద్‌లో మహిళల అండాల అక్రమ సేకరణ, విక్రయానికి సంబంధించిన దందా వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బి. చంద్రావతి పేర్కొన్నారు.ఇతర రాష్ట్రాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు డబ్బు ఆశ చూపి హైదరాబాద్‌కు తీసుకువచ్చి, అండాల సేకరణకు ఉపయోగించుకున్నారనే ఆరోపణలు మహిళల ఆరోగ్యం, భద్రత, గౌరవానికి సంబంధించిన తీవ్రమైన అంశాలని అన్నారు.అండాల సేకరణ అనేది వైద్యపరంగా అత్యంత జాగ్రత్తతో నిర్వహించాల్సిన ప్రక్రియ అని, హార్మోన్ ఇంజెక్షన్లు, అండాశయాల అధిక ప్రేరణ వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్ చంద్రావతి తెలిపారు. సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా ఇటువంటి ప్రక్రియలు నిర్వహించడం మహిళల ప్రాణాలకు ముప్పుగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టి, మధ్యవర్తులు, సంబంధిత ఫెర్టిలిటీ కేంద్రాలు, ఇతరుల పాత్రను నిష్పక్షపాతంగా విచారించాలని డిమాండ్ చేశారు.ముఖ్యంగా ART (Regulation) Act, 2021 ప్రకారం అండదాతల సమ్మతి, అండదాన పరిమితులు, బీమా రక్షణ వంటి నిబంధనలు అమలవుతున్నాయా అనే అంశాలపై ప్రత్యేక విచారణ జరపాలని కోరారు. రాష్ట్రంలోని IVF కేంద్రాలు, ART బ్యాంకుల అనుమతులు, వైద్య రికార్డులు, నిర్వహణ విధానాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని సూచించారు.రక్షించిన మహిళలందరికీ అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స, మానసిక సహాయం అందించడంతోపాటు వారి వ్యక్తిగత వివరాలకు గోప్యత కల్పించాలని కోరారు. దర్యాప్తులో బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మహిళల ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకొని వారి శరీరాన్ని వ్యాపార వస్తువుగా మార్చే అక్రమాలకు తావులేకుండా, రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డాక్టర్ బి. చంద్రావతి కోరారు.

Related News

Select the Topic
Scroll to Top