EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉప్పల్ జోన్‌లో ఇద్దరు దొంగలు అరెస్ట్

ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 1:

ఉప్పల్ జోన్‌లో ఇద్దరు దొంగలు అరెస్ట్.20 రోజుల్లో 10 చోరీలు.. 37 తులాల బంగారం స్వాధీనం.విలాసవంతమైన జీవితం కోసం మహిళ చోరీలు.. బురఖాతో గుర్తింపు దాచిన వైనం.. !

———

ఉప్పల్ జోన్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 37 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.నవీన్ అనే నిందితుడు కేవలం 20 రోజుల వ్యవధిలోనే 10 చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. జైలు నుంచి విడుదలైన వెంటనే తిరిగి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడి నుంచి 37 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

విలాసవంతమైన జీవితం కోసం మహిళ చోరీలు.. !

మరో కేసులో జయ అనే మహిళను కూడా ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. చదువును మధ్యలోనే నిలిపివేసిన ఆమె.. భర్తకు తెలియకుండా ఆన్‌లైన్‌లో చోరీలకు సంబంధించిన పద్ధతులు నేర్చుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశతో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చోరీలు చేసే సమయంలో తన గుర్తింపు బయటపడకుండా బురఖా ధరించినట్లు పేర్కొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top