EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి – ర్యాగింగ్‌కు స్వస్తి పలకండి

ఈతరం భారతం మహబూబాబాద్ టౌన్ నవంబర్ 4:

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ  డా. పి. శబరీష్, ఆదేశాల మేరకు మహబూబాబాద్ షీ టీమ్స్, భరోసా ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్‌లో 320 మంది విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా షీ టీమ్స్ ఎస్ఐ సునంద మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, ఓటీపీలు షేర్ చేయవద్దని, సోషల్ మీడియాను పరిమితంగా వినియోగించాలని, ఫోటో మార్ఫింగ్ వంటి సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. చదువుపైనే ప్రధానంగా దృష్టి సారించి భవిష్యత్తు లక్ష్యాలను సాధించాలని సూచించారు.

అదేవిధంగా మహిళల భద్రత, ఈవ్ టీజింగ్ నివారణ, ర్యాగింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా షీ టీమ్స్‌ను సంప్రదించి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు.

మహిళలు, బాలికల భద్రత కోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లు, పార్కులు తదితర ప్రాంతాల్లో షీ టీమ్స్ నిరంతరం నిఘా కొనసాగిస్తాయని వివరించారు.

అత్యవసర సహాయం కోసం సంప్రదించండి:

* పోలీస్ అత్యవసర నంబర్: 112

* మహబూబాబాద్ షీ టీమ్స్: 8712656935

* చైల్డ్ హెల్ప్‌లైన్: 1098

Related News

Select the Topic
Scroll to Top