EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణలో తీవ్ర విషాదం..  బోట్లు తిరగబడి 10 మంది కానిస్టేబుళ్లు గల్లంతు

ఈతరం భారతం ఖమ్మం నవంబర్ 4:

_____________________________

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన 10 మంది పోలీస్ కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న రెండు ఎస్‌డీఆర్ఎఫ్ బోట్లు తిరగబడటంతో వారంతా చెరువులో గల్లంతయ్యారు.బేతుపల్లి చెరువులో ఐదుగురు మత్స్యకారులు ప్రమాదవశాత్తు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు 10 మంది పోలీస్ కానిస్టేబుళ్లు రెండు బోట్లలో చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలోనే నీటి ప్రవాహం, గాలి ధాటికి రెండు బోట్లు కూడా ఒక్కసారిగా నీటిలో తిరగబడ్డాయి.దీంతో బోట్లలో ఉన్న 10 మంది కానిస్టేబుళ్లు చెరువు నీటిలో మునిగిపోయి గల్లంతయ్యారు. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు, రెస్క్యూ సిబ్బంది, గజ ఈతగాళ్లు హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్నారు. గల్లంతైన కానిస్టేబుళ్ల కోసం చెరువులో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Related News

Select the Topic
Scroll to Top