ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 4
ఈ సంవత్సరం ఇండీ కామిక్స్ ఫెస్ట్ హైదరాబాద్ అద్భుతంగా రెండవ సారి జరిగింది! సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన ఈ ఉత్సవం కామిక్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని ఈ సందర్భంగాICF హైదరాబాద్ చాప్టర్ ఆర్గనైజర్ లికిత్ కుమార్ తిరుకోవెల తెలిపారు.ఈ ప్రదర్శన వల్ల పిల్లల్లో, మరియు స్టోరీ టెల్లింగ్ ప్రొఫెషనల్స్ వారి నైపుణ్యాన్ని కూడా వృద్ధి చెందుతున్నారు. అన్నారు.
ఒక నాన్-ప్రాఫిట్ వేదిక అయిన ఈ ఇండీ కామిక్స్ ఫెస్ట్ (ICF) ప్రతి సంవత్సరం బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కొచ్చి వంటి పలు నగరాలలో జరుగుతూ, దేశవ్యాప్తంగా ఉన్న కామిక్ కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రతిభావంతులైన ఆర్టిస్టులు తమ సృజనాత్మక కామిక్ పుస్తకాలను ప్రదర్శించి సందర్శకులను ఆకట్టుకున్నారు.
ఇది అభివృద్ధి చెందుతున్న కళాకారులు, విద్యార్థులు, అలాగే వృత్తిపరులకూ తమ ప్రతిభను ప్రదర్శించుకునే ఉత్సాహభరితమైన వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా కామిక్స్ రచన, స్కెచింగ్, ఐడియేషన్ వంటి అంశాలపై ఒక సరదా మరియు ఇంటరాక్టివ్ వర్క్‌షాప్ కూడా నిర్వహించబడి, పాల్గొన్నవారిలో సృజనాత్మకతను రగిలించాయి. మరొక వర్క్‌షాప్ అకర్మా వాళ్ళు మెట్ల బావుల సంరక్షణ మరియు నిర్వహణ పై నిర్వహించారు.ఇండీ కామిక్స్ ఫెస్ట్ హైదరాబాద్— సృజనాత్మకత, కళ, కథల పండుగగా నగర హృదయంలో కొత్త ఊపిరి నింపింది!















