EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

CAT 2026 హాల్‌టికెట్లు విడుదల…

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 8

———————————————–

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ఇందౌర్ CAT 2026 హాల్‌టికెట్లను విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in ద్వారా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 29న క్యాట్‌ పరీక్ష జరగనుంది. హాల్‌టికెట్‌లోని పరీక్ష తేదీ, స్లాట్, రిపోర్టింగ్ సమయం, పరీక్ష కేంద్రం వివరాలను అభ్యర్థులు ముందుగానే తనిఖీ చేసుకోవాలి.ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2026 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ఇందౌర్ అడ్మిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. CAT 2026 పరీక్షను నవంబర్ 29న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా దేశంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIMలు)తో పాటు ఇతర ప్రముఖ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో ఎంబీఏ, సంబంధిత మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు సాధించిన క్యాట్ స్కోరు, ఆయా విద్యాసంస్థల ప్రవేశ నిబంధనల ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి.

Related News

Select the Topic
Scroll to Top