ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 11:
_________________________________
దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్ గా పంజాగుట్ట.డిసెంబర్ మొదటివారంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం.ఫిర్యాదుల నుంచి ఛార్జ్‌షీట్ వరకు కృత్రిమ మేధతోనే!పంజాగుట్ట పీఎస్‌లో సీపీ సజ్జనర్ ఆకస్మిక తనిఖీ.. సాంకేతిక పనుల పరిశీలన.
దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట ఠాణా రూపుదిద్దుకుంటోందని నగర పోలీస్ కమిషనర్ సీ పీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. గౌరవ డీజీపీ సీవీ ఆనంద్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఠాణాలోని అన్ని సేవలను అత్యాధునిక ఏఐ సాంకేతికతతో అనుసంధానిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.బుధవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సీపీ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో ఆయన నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఠాణాలోని ప్రతి ఒక్క సిబ్బంది పనితీరును, వారు నిర్వహిస్తున్న విధులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో జరుగుతున్న ఏఐ సాంకేతిక ఏర్పాట్లను ఏసీపీ మురళీకృష్ణ, ఇన్స్పెక్టర్ జహంగీర్‌తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు
డిసెంబర్ నెల మొదటి వారంలో గౌరవ డీజీపీ గారి చేతుల మీదుగా ఈ ఏఐ ఠాణాను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక్కడి ఫలితాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్టేషన్లలోనూ ఈ విధానాన్ని అమలు చేస్తారని వివరించారు.ఇప్పటికే ఠాణా రిసెప్షన్ వద్ద ఏర్పాటు చేసిన ‘సేతు’ కియోస్క్ ద్వారా బాధితులు దాదాపు 10 భాషల్లో తమ ఫిర్యాదులు ఇవ్వొచ్చని, ఏఐ సాంకేతికత వాటిని స్థానిక భాషలోకి తర్జుమా చేసి క్షణాల్లో సంబంధిత అధికారులకు పంపుతుందని వివరించారు.
ఎఫ్ఐఆర్ నమోదు మొదలుకుని కేసు డైరీ, దర్యాప్తు నివేదికలు, ఛార్జ్‌షీట్ రూపకల్పన వరకు అన్నీ ఏఐ ఆధారంగానే సాగుతాయన్నారు. పంజాగుట్ట పరిధిలోని రద్దీ, హాస్టళ్లు, వాణిజ్య సముదాయాలు, నేరాల చరిత్ర తదితర వివరాలను విశ్లేషించి బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వ్యవస్థను మరింత సమర్థంగా నడిపిస్తామని, సాంకేతికత వినియోగంపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని నగర సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పేర్కొన్నారు.















