ఈతరం భారతం న్యూఢిల్లీ నవంబర్ 11:
పెన్షనర్లందరికీ కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. పింఛను పొందే వారు ప్రతి ఏటా సమర్పించాల్సిన జీవిత ధృవీకరణ పత్రం (లైఫ్ సర్టిఫికేట్) సమర్పించడానికి నవంబర్ 30 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. ఈ గడువులోగా ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో పెన్షన్ నిలిచిపోతుందని స్పష్టం చేసింది. సీనియర్ సిటిజన్లు ఎక్కడికీ వెళ్లకుండానే ఉమాంగ్ యాప్, జీవన్ ప్రమాణ్ యాప్ లేదా పోస్టల్ శాఖ డోర్ స్టెప్ సేవలను ఉపయోగించి ఆన్లైన్ ద్వారా ఇంట్లోనే సులభంగా డిజిటల్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు.















