ఈతరం భారతం న్యూఢిల్లీ నవంబర్ 11:
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం, రిసెప్షన్‌కు రావాల్సిందిగా రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా ఆహ్వానించారు.కాబోయే దంపతులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.తమ కుటుంబంలోని ఈ ప్రత్యేక వేడుకకు రాహుల్ గాంధీ హాజరవుతారని ఆశిస్తున్నట్లు వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.















