EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణలో కొత్త పింఛన్ల పంపిణీ షురూ.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 12:

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నూతన లబ్ధిదారులకు ‘చేయూత’ పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో మరో 4.5 లక్షల మంది అర్హులకు కొత్తగా పింఛన్లను మంజూరు చేశారు. ఈ నెల 12 నుంచి 18 వరకు అన్ని జిల్లాల్లో ఈ మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది.నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. తాజాగా మంజూరు చేసిన పింఛన్లతో కలిపి రాష్ట్రంలో కొత్త లబ్ధిదారుల సంఖ్య 5,73,625కు చేరింది.వితంతువులు, గీత , చేనేత కార్మికులు, దివ్యాంగులు, వృద్ధులతో పాటు మహిళలకు ఈ కొత్త పింఛన్లలో ప్రాధాన్యత కల్పించారు.

Related News

Select the Topic
Scroll to Top