ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 12:
దేశవ్యాప్తంగా పాల వినియోగదారులకు అమూల్ సంస్థ షాక్ ఇచ్చింది. పాల ధరలను 4 నుంచి 5 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు నవంబర్ 12 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో నిత్యం అమూల్ పాలను కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడనుంది.తాజా ధరల పెంపులో భాగంగా అమూల్ తాజా పాల లీటర్ ప్యాకెట్‌పై రూ.2 పెంచగా, అమూల్ గోల్డ్ లీటర్ ప్యాకెట్‌పై రూ.4 పెంచినట్లు సంస్థ వెల్లడించింది.పశువుల మేత, దాణా ధరలు పెరగడంతో పాటు పాల సేకరణ, ప్యాకేజింగ్, రవాణా, ఇంధన ఖర్చులు గణనీయంగా పెరిగాయని అమూల్ తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలోనే ధరల సవరణ చేపట్టినట్లు పేర్కొంది.
అంతేకాకుండా పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారికి మెరుగైన ధర అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.ధరల పెంపు నేపథ్యంలో ఇకపై ప్రతిరోజూ పాలు కొనుగోలు చేసే కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై అదనపు ప్రభావం పడనుంది.















