ఈతరం భారతం విశాఖ పట్టణం నవంబర్ 12
CII సమ్మిట్ వేదికగా వైజాగ్‌లో ఒక అద్భుత దృశ్యం! భారీ ఇంటరాక్టివ్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ముందు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడి, తన చేతితో ఒక్కో ప్రాంతాన్నీ చూపిస్తూ, రాష్ట్ర భవిష్యత్తును కళ్ళకు కట్టారు. పక్కనే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గారు ఆసక్తిగా వింటూ, ప్రతి మాటనూ గమనించారు.
ఆయన వివరిస్తుంటే నారా లోకేష్ గారు కూడా మ్యాప్ వద్దే కలిసి, తండ్రితో పాటు మరిన్ని విశేషాలు తెలిపారు. చుట్టూ నిలబడిన ప్రముఖులు, అధికారులు అందరూ ఆ విజన్‌ను ఆసక్తితో చూశారు!
25 ప్రత్యేక ఎకోసిస్టమ్‌లు: పెట్రోకెమికల్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, రోబోటిక్స్, డ్రోన్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్గానిక్ ఫుడ్… ప్రతి రంగంలోనూ ఏపీని నంబర్ వన్ చేసే మహా ప్రణాళిక!వర్టికల్ + హారిజాంటల్ ఇంటిగ్రేషన్: షిప్‌బిల్డింగ్‌లో 360 కంపెనీలతో బలమైన చైన్. మరోవైపు ఐఐటీ తిరుపతి ద్వారా పరిశోధన, స్కిల్లింగ్, శిక్షణ!
ముడిసరుకు నుంచి అంతిమ ఉత్పత్తి వరక రా మెటీరియల్, రేర్ ఎర్త్స్ నుంచి బ్యాక్వర్డ్ – ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్‌తో ప్రతి పరిశ్రమా ఒకదానికొకటి అల్లుకుపోయే పక్కా ప్లాన్!తిరుపతి – గ్లోబల్ డిజైన్ క్యాపిటల్: వ్యవసాయం నుంచి శాటిలైట్ల వరకు అన్నింటిలో రాణిస్తూ, తిరుపతిని ప్రపంచ స్థాయి “డిజైన్ క్యాపిటల్”గా మార్చాలనే అసాధారణ లక్ష్యం! చైనా తర్వాత ఆ స్థాయిలో భారత్ నిలవాలన్న సంకల్పం! మ్యాప్‌పై ఆయన వేలు కదులుతుంటే, రాష్ట్ర రూపురేఖలు మారబోతున్న చరిత్ర కళ్ళ ముందు కనిపించింది. ఇది కేవలం ప్రణాళిక కాదు, మన రాష్ట్ర భవిష్యత్తును మార్చే మహాయజ్ఞం!














