EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల నమోదుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ విధానాన్ని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారితో కలిసి ఆవిష్కరించారు. గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల నమోదుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించారు.

ముఖ్యాంశాలు:

✅ దేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని జయభేరీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన చట్టాన్ని అంకితం చేశారు.

✅ తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ నిబంధనల పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమం ప్రారంభంలో దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

✅ అంతకుముందు శిల్పారామం నుంచి జయభేరీ గ్రౌండ్స్ వరకు చేపట్టిన భారీ బైక్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ గారితో కలిసి పాల్గొన్నారు. ప్లాట్‌ఫామ్ కార్యకర్తల బైకులపై రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, పలువురు మంత్రులు, గిగ్ వర్కర్లతో కలిసి బైక్ ర్యాలీగా జయభేరీ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు.

✅ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం నెహ్రూ గారి జన్మదినం రోజున గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ చట్టాన్ని ప్రజలకు అంకితం చేశామని చెప్పారు. ఈ చట్టం నేటి నుంచి అమలులోకి వస్తుందన్నారు.

✅ ఈ చట్టం వల్ల ప్రతి గిగ్ వర్కర్‌కు రూ. 5 లక్షల జీవిత బీమా సౌకర్యం లభిస్తుందని, ఆరోగ్య భద్రత కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా వర్కర్లకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డు లభిస్తుందని చెప్పారు.

✅ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ కోసం చట్టం రూపొందించడానికి ఐఐటీ లాంటి సంస్థలతో పాటు సామాజిక కార్యకర్త నిఖిల్ డే గారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఎంతో సహకారం అందించారని చెప్పారు. గిగ్ వర్కర్ల నాయకులు, నిపుణులతో అనేక సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ చట్టం రూపొందించామని తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు.

✅ ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్లు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top