ఈతరం భారతం ఖమ్మం నవంబర్ 16:
——————————————-
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 19న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి కేంద్రమంత్రి పర్యటన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఖమ్మం జిల్లా జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ దివ్య కేంద్రమంత్రి పర్యటనకు సంబంధించిన వివరాలను కలెక్టర్కు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూఈ నెల 19న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నందున, కేంద్రమంత్రి పర్యటనకు సంబంధించి ఈవెంట్ మేనేజర్ అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మినిట్ టు మినిట్ ప్రోగ్రాం రూపొందించి, కార్యక్రమాల షెడ్యూల్ను ముందుగానే ఖరారు చేయాలని కలెక్టర్ సూచించారు. పర్యటనలో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని, ఆయా శాఖలకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హెలిప్యాడ్, రహదారుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి:;
కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాట్లను అవసరమైన ప్రమాణాల ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఆర్ అండ్ బి శాఖ అధికారులు పర్యటన మార్గాల్లో రహదారులకు ఇరువైపులా అవసరమైన మరమ్మతులు, ఇతర మౌళిక సదుపాయాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. కేంద్రమంత్రి పర్యటనలో పాల్గొనే వీవీఐపీ లు, వీఐపీలు, సాధారణప్రజలకు వేర్వేరుగా పాసులు జారీ చేయాలని, వారి ప్రవేశ మార్గాలు, కూర్చునే ఏర్పాట్లను ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు. సభా ప్రాంగణంలో ఎలాంటి గందరగోళం లేకుండా వేర్వేరు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.సభా వేదిక సామర్థ్యానికి అనుగుణంగా వేదికపై ఉండే వారి సంఖ్యను ముందుగానే నిర్ధారించాలని, ప్రసంగించేవారి వివరాలు, ప్రసంగాల క్రమం, యాంకర్ నిర్వహణ తదితర అంశాలను ఖరారు చేయాలని పిడి దివ్య కు సూచించారు.* సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీటింగ్, పార్కింగ్, భద్రత, ఇతర సౌకర్యాలను సమగ్రంగా ఏర్పాటు చేయాలని తెలిపారు.కేంద్ర మంత్రి పర్యటనకు సంబంధించి అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, వారికి కేటాయించిన పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.*ఈ సమావేశంలో* అదనపు డీసీపీ రామానుజం, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్ రావు, పిఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఇ ఇనుగుర్తి శ్రీనివాసా చారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. డి. రామారావు, సంబంధిత శాఖల అధికారులు, జాతీయ రహదారుల శాఖ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.















