ఈతరం భారతం న్యూఢిల్లీ నవంబర్ 16:
వరల్డ్ హెరిటేజ్ వీక్ సందర్భంగా నవంబర్ 19న తాజ్‌మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీల్లో ఉచిత ప్రవేశం ఉంటుందని ASI ప్రకటించింది.మరోవైపు తాజ్‌మహల్ ప్రాంగణంలో కెమెరాలకు అందని చోట్ల 360 డిగ్రీల కెమెరాలతో సహా అదనపు సీసీటీవీలు పెట్టాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.టూరిస్ట్ గైడ్లను సులభంగా గుర్తించేందుకు వారికి వేర్వేరు రంగుల ఐడీ కార్డులు ఇవ్వనున్నారు.















