ఈతరం భారతం ఇంద్రకీలాద్రి ఆంధ్ర ప్రదేశ్ నవంబర్ 16:
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనక దుర్గమ్మను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి శ్రీమతి ఎస్.సవిత, హోమ్ శాఖ మంత్రి శ్రీమతి వి. అనిత, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జి. సంధ్యారాణి సోమవారం ఉదయం దర్శించుకున్నారు.శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు మంత్రులకు వేదఆశీర్వచనం అందజేశారు. దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికె శీనా నాయక్ వారికి అమ్మవారి శేషవస్త్రం,ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.అనంతరం మల్లేశ్వరుని దర్శించుకున్న మంత్రులు, పూజా మండపం వద్ద దేవస్థానం ఉచిత ప్రసాదం తీసుకుని సాధారణ భక్తులతో స్వీకరించారు.















