EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

శబరిమలలో భక్తులకు కష్టాలు…

ఈతరం భారతం శబరిమల,నవంబర్ 16:

అయ్యప్ప భక్తుల మండల దీక్ష రద్దీ దృశ్య శబరిమలలో రద్దీ అంతక0తకు పెరుగుతుంది. నిన్నటి నుండి వచ్చిన బస్సులన్నీ కూడా నీలక్కల్ శివ టెంపుల్ వద్ద నిలిపివేసిన అధికారులు కేవలం ఒక షెడ్డు మాత్రమే అందుబాటులో ఉంచారు. కనీసం తాగునీటి వసతులు లేకపోవడం తినుబండారాలు దొరకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపుగా 10000 మంది భక్తులు నీలక్కల్ శివ టెంపుల్ వద్ద పడికాపులు కాస్తున్నారు. అటు దేవస్థానం అధికారులు గానీ ఇటు పోలీసులు గాని వారి ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. కేవలం నేలక్కల్ వచ్చిన బస్సుల్లోని అయ్యప్ప భక్తులని బస్సుల నుండి కిందకు దింపి వెయిటింగ్ లో పెట్టడమే తమ పని అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వాస్తవంగా 16వ తారీకు సాయంత్రం ఐదు గంటలకి గుడి తెరుచుకుని భక్తులను దర్శనానికి అనుమతించవలసి ఉంది కానీ 12 గంటల వరకు కూడా బస్సులను భక్తుల కోసం సిద్ధం చేయకుండా కేవలం నామాత్రంగానే బస్సులను ఖాళీగా తిప్పుతూ కేఎస్ఆర్టిసి అధికారులు చోద్యం చూస్తున్నారు. దీనివల్ల భక్తులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు ఈ విధమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉదాసీనంగా ఉండడం గమనార్హం.

Related News

Select the Topic
Scroll to Top