EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మీడియాతో మంత్రి పొంగులేటి చిట్ చాట్

ఈ తరం భారతం హైదరాబాద్ నవంబర్ 21:

మీడియాతో మంత్రి పొంగులేటి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల సర్వే దాదాపు పూర్తయిందని తెలిపారు.ఫామ్‌హౌస్ భూముల లెక్కలన్నీ త్వరలో అసెంబ్లీలో బయటపెడతామని అన్నారు.భూముల సర్వే ప్రారంభమైనప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లి ముందస్తు స్టే తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్‌కు బదులుగా సీకెంట్ పైల్స్ వాడటంపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కాళేశ్వరం పేరుతో వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందని విమర్శించారు.తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.రాజకీయ పోరాటం ఎలా చేయాలో, ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలో కాంగ్రెస్‌కు తెలుసని అన్నారు.ఎన్నికల్లో మళ్లీ గెలిచి గోల్ కొట్టి అధికారంలోకి వస్తామని పేర్కొన్నారు.బీజేపీపై విమర్శలు చేస్తూ, ఆ పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే కష్టమని ఎద్దేవా చేశారు.

Related News

Select the Topic
Scroll to Top