ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 21:
జాతీయ సఫాయి కర్మచారి కమిషన్, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, సభ్యులు కరమ్ సింగ్ కర్మ తెలంగాణ రాష్ట్రంలో పర్యటన సందర్బంగా వాల్మీకి సఫాయి కర్మచారి సంఘ్ నాయకులు,సామాజిక సేవకులు ఎస్.సుభాష్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో సఫాయి కర్మచార్ ల సమస్యలపై కలిసి వినతి ప్రెరం సమర్పించారు.ఈ సందర్బంగావివిధ ప్రభుత్వ శాఖలు మరియు బ్యాంకుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలను తెలుసుకుంటున్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తాంజని హామీ ఇచ్చారు.















