ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 21:
గాంధీ ఆసుపత్రిలో ఉచిత IVF చికిత్స ద్వారా ఓ దంపతులు త్రిప్లెట్స్కు జన్మనిచ్చారు. సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు ఈ సేవలు ఆశలు కల్పిస్తున్నాయి.ఆసుపత్రిలో IVF చికిత్స ద్వారా ఇటీవల మరికొన్ని విజయవంతమైన ప్రసవాలు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫెర్టిలిటీ సేవలతో ఎంతోమందికి ప్రయోజనం కలుగుతోంది.ఉచిత IVF సేవలతో ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రి చికిత్సలు అందుకోలేని కుటుంబాలకు కూడా అధునాతన సంతానోత్పత్తి వైద్యం అందుబాటులోకి వస్తోందని ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు.















