ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 27:
విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునే తెలంగాణ యువతకు ఆర్థిక సాయం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
లబ్ధిదారులు : తొలి ఏడాది (2026–27)లో 7,000 మంది యువతకు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన (EWS) కుటుంబాల యువతకు ప్రాధాన్యత ఉంటుంది.
సబ్సిడీ వివరాలు : వీసా, విమాన ప్రయాణం, విదేశీ భాషా శిక్షణ ఖర్చుల్లో 50% సబ్సిడీ అందిస్తారు. నేరుగా విదేశీ ఉద్యోగాలకు రూ.50,000 వరకు, విదేశీ భాష అవసరమైన ఉద్యోగాలకు రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సాయం ఉంటుంది.
రిజర్వేషన్లు & అర్హత : మహిళలకు 33.33%, దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించారు. దరఖాస్తుదారుల వయసు 18–40 ఏళ్లు ఉండాలి. విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవం ఆధారంగా ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు & ఎంపిక ప్రక్రియ : TOMCOM ప్రత్యేక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల ద్వారా ఎంపిక చేపట్టి, గడువు ముగిసిన తర్వాత 30 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సబ్సిడీ నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అవసరమైన వారికి బ్యాంకు లింక్డ్ రుణ సదుపాయం కూడా ఉంటుంది.















