ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 27:
__________________________________
నూతనంగా ఎన్నికైన తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ సామల రామ్ రెడ్డిని తెలంగాణ అడ్వకేట్ నోటరీస్ అసోసియేషన్ “తానా” బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ హైకోర్ట్, హైదరాబాద్ లో ఘనంగా సన్మానించింది. అలాగే వైస్ ఛైర్మన్ వెంకట్ యాదవ్ చలకాని,
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ తెలంగాణ మెంబర్ కిరణ్ కుమార్. జి లను “తానా” శాలువాలు కప్పి సత్కరించింది.వీరితో పాటు రాజ్యాంగ దినోత్సవం(సంవిధాన దివస్) పురస్కరించుకుని బార్ అసోసియేషన్ ఆఫ్ హైకోర్టు ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి ని సన్మానించింది.
ఈ సందర్భంగా సన్మానితులకు “తానా” మెమెంటో లు అందచేసింది.
కార్యక్రమంలో భాగంగా తానా అధ్యక్షులు గంజి యాదగిరి కోర్టుల్లో సివిల్ అండ్ క్రిమినల్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ లోఅఫిడవిట్ లపై నోటరీ అటెస్టేషన్ తప్పని సరి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఒక వినతి పత్రం సాముల రామ్ రెడ్డికి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు గంజి యాదగిరి, గౌరవ అధ్యక్షులు గోలి దేవేందర్, కార్యదర్శి కె. నర్సింహారావు లతో పాటు న్యాయవాదులు సుదర్శనాచారి,వినోద్, వెంకటేశ్వర్లు, కుమనం బలరాం, ,పి.సతీష్, సుప్రీం కోర్టు న్యాయవాది జి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.















