నారాయణ పేట్ మార్చ్ 6 (ఈ బీ న్యూస్ );బీసీ వ్యతిరేక పార్టీలకు వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఓటు వేయకూడదని బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు.కోస్గి మండలకేంద్రం లో బీసీ సంక్షేమ సంఘము నారాయణ పేట్ జిల్లా అధ్యక్షులు గొల్ల నర్సిములు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ, రాజకీయపార్టీలజెండాలు వేరైనా బీసీలను కులాలుగా విడదీసి చట్ట సభలలో బీసీలు అడుగు పెట్టకుండా రాజకీయంగా అణచి వేయడం లోవారి అజెండా ఒక్కటేనని అన్నారు.మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు ను అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే కేటాయించా లని బీసీ సంక్షేమ సంఘము,బీసీసేన ఆధ్వర్యంలో గత నాలుగు నెలలు గా పార్లమెంట్ వ్యాప్తంగా బీసీ కుల సంఘాల సమావేశా లలో తీర్మానం చేసి అన్ని రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలలో బీసీలకే మహబూబ్ నగర్ పార్లమెంట్ సీట్ కేటాయించాలని మెమొరాండాలు అందజేసిన కూడాకాంగ్రెస్, బి ఆర్ స్ పార్టీలు పెట్టుబడిదారులకు పార్లమెంటు సీటు కేటాయించి బీసీలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. 2014,,2019 ఎన్నికలలో బిజెపి పార్టీ నుండి పార్లమెంటు సీటు ఆశించి, పార్టీ నిర్ణయాల మేరకు త్యాగం చేసినబండారి శాంతి కుమార్ గారికి బీజేపీ పార్టీ పార్లమెంట్ సీటు కేటాయించా లని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమం లో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భానుచందర్,గొడుగు నర్సిములు,బీసీ నాయకులు, సంగప్ప, రమేష్, రాజు, నవీన్, మహేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
.














