ఈతరం భారతం మన్యం జిల్లా: ఆంధ్ర ప్రదేశ్ నవంబర్ 12:
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత విజయరామరాజు కన్నుమూశారు. విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన విజయరామరాజు ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ప్రజలకు సేవలందించారు. ఆయన మృతి టీడీపీలో విషాదం నింపింది.















