EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

టీడీపీ అభిమానుల ఓట్లను తొలగించి దొంగ ఓట్లు చేర్చుతున్న వైసీపీ నాయకులు

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిసభలంటే జనం భయపడిపోతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిఎద్దేవ చేశారు. బుధవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘రేపు సామర్లకోటలో జరిగే జగన్ బహిరంగ సభకు బలవంతంగా లక్ష మందిని తరలిస్తున్నారు.ఏపీలో తప్పుడు విధానాలతో మళ్లీ అధికారంలోకి రావాలని జగన్ ప్రయత్నిస్తున్నాడు. జగన్ బస్సు యాత్ర కాదు పాదయాత్ర చేయాలి. వైసీపీ నాయకులు టీడీపీ అభిమానుల ఓట్లను తొలగించి దొంగ ఓట్లు చేర్చుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఓట్లు మార్పులకు గురయ్యాయి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోనే 23 వేల ఓట్లు ప్రభావితం అవుతాయి. వలంటీర్ల ద్వారా టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారు. చంద్రబాబు జైలులో ఉన్న విషయాన్ని ఆసరగా తీసుకొని టీడీపీ ఓట్లు తొలగిస్తున్నారు’’ అని గోరంట్ల బుచ్చయ్య మండిపడ్డారు.

Related News

Select the Topic
Scroll to Top