EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రజలను తప్పుదోవ పట్టించేలా జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్‌ ప్రకటనలు

చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు ఓ పక్క స్పష్టంగా వైద్యుల నివేదిక ఉన్నప్పటికీ….ప్రజలను తప్పుదోవ పట్టించేలా జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్‌ ప్రకటనలు ఇవ్వడాన్ని ఐహెచ్ఆర్ఏ సివిల్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ చర్మెన్ కరణం తిరుపతి నాయుడు తప్పుబట్టారు. చంద్రబాబుకు సౌకర్యాలపై అధికారులకు వైద్యులు సూచన చేసి 48 గంటలు దాటినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తే మామూలు ఖైదీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో మనవ హక్కులు కాలరాయబడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. డీ హైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును చల్లని వాతావరణంలో పెట్టాలని వైద్యుల సూచిస్తే.. ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వైద్యుల సూచనలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు అనారోగ్యంపైనా దాచిపెట్టడం, డాక్టర్ నివేదికలు తొక్కి పెట్టడం వెనుక గల అంతర్యమేమిటని ప్రశ్నించారు. అనారోగ్యం పేరుతో కుట్ర జరుగుతుందని ఆరోపించారు.జైలు అధికారులు చెప్పేది ఒకటి వైద్యులు చెప్పేది ఒకలా ఉందని అన్నారు.ఆరోగ్య భద్రతలేని జైల్లో ఆరోగ్యం క్షీనిన్చేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.చంద్రబాబు అరెస్ట్ విదానం సరికాదని,హౌస్ అరెస్ట్ చేస్తే సరిపోయేదని,అతనేమైనా దేశాద్రోయా దేశాన్ని వదిలి పారిపోతాడా అని తిరుపతి నాయుడు ప్రశ్నించారు.

 

Related News

Select the Topic
Scroll to Top