విశాఖ కనకమహాలక్ష్మి దేవాలయంలో సంగీత మంగళ వాయిద్యాలు వాయించే నాయి బ్రాహ్మణ సోదరులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ మొక్కి దక్షిణ సమర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమ సమాజం కోసం సంఘసంస్కర్తలు నాడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (బ్రహ్మంగారు) నుండి మహాత్మ జ్యోతిరావు పూలే పెరియార్ రామస్వామి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి లాంటి పెద్దల ఆశయాలను నేడు మారిన ప్రపంచీకరణ మార్పులకు అనుగుణంగా దేవాలయాల్లో వెళ్లే మన బడుగు బలహీన వర్గాల వారు మన వర్గాలకు చెందిన ఉదయం దేవతలని మేలుకొలిపే దగ్గర నుండి మంగళ హారతి ఇచ్చేదాకా ఎంతో సేవ చేస్తున్న అదృష్టవంతులైన నాయి బ్రాహ్మణ సంగీత కళాకారులకు హిందూ దేవాలయాలు సందర్శించిన భక్తజనం గౌరవంతో పాటు దక్షిణ కూడా ఇచ్చే అలవాటుకి శ్రీకారం చుట్టారు. విశాఖపట్నంలో శ్రీకారం చుట్టి దేశంలోని బీసీ నాయకులకు ఈ కార్యక్రమాన్ని ప్రతివాళ్ళు రేపు శ్రీదేవి నవరాత్రుల నుంచి ప్రారంభించవలసిందిగా దేశం లోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఆలోచన చాలా బాగుంది అంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య బిసి కర్రి వేణుమాధవ్ ని అభినందించారు.ఈ కార్యక్రమం అన్నిచోట్ల ప్రారంభింప చేస్తావని పలువురు బీసీ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వనకార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పక్కి కొండలరావు విశాఖ నగర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ముదపాక రవి ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ అప్రైవ్ అసోసియేషన్ నాయకుడు పెట్ల గోపి తదితరులు బిసి నాయకులు పాల్గొన్నారు.