ఈతరం భారతం తిరుపతి నవంబర్ 21రిపోర్టర్ మనోజ్ కుమార్:
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న ముద్రణాలయంలో శనివారం ఆయుధ పూజ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముందుగా శ్రీవారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ముద్రణాలయాన్ని అందంగా అలంకరించి, అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముద్రణాలయంలోని డీటీపీ, ఆఫ్‌సెట్, మిషన్, ఆర్టిస్టు, బైండింగ్ విభాగాల్లోని యంత్రాలకు ఆయుధ పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముద్రణాలయ డిప్యూటీ ఈవో విజయ్ కుమార్, పీఆర్వో (ఎఫ్ఏసీ) కుమారి పి. నీలిమ, యూనియన్ నాయకులు ఎన్. శ్రీనివాసన్, వి.కె. శ్రీనివాసులు, శ్రీనివాసమూర్తి, భాస్కర్, శ్రీమతి శ్రీదేవి, వివిధ విభాగాల సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.















