ఏపీ సర్కార్ మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలంలో 500 కోట్లు 14 సంవత్సరాలకు 7.66 శాతం , మరో 500 కోట్లు 20 సంవత్సరాలకు 7.61 శాతం వడ్డీతో రుణం తీసుకుంది. ఈ వెయ్యి కోట్లతో 68 వేల 950 కోట్లకు ఏపీ అప్పు చేరింది. ఎఫ్ఆర్బీఎం కింద 45 వేల 950 కోట్ల రూపాయలు అప్పు వైసీపీ ప్రభుత్వం తెచ్చింది. కార్పొరేషన్ల ద్వారా 23 వేల కోట్లు అప్పును జగన్ సర్కార్ తెచ్చింది. ఏడు నెలల్లో రికార్డ్ స్థాయిలో 68 వేల 950 కోట్లను జగన్ సర్కార్ అప్పు తెచ్చింది.