EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వ్యవసాయం అనుబంధ రంగాలతో పాటు పౌర సరఫరాల శాఖలపై జగన్ సమీక్ష

వ్యవసాయం అనుబంధ రంగాలతో పాటు పౌర సరఫరాల శాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రంలో పంటల సాగు, తాజా పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ దాదాపుగా సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపారు. అయినా జూన్, ఆగస్టు నెలల్లో వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై ప్రభావం, దీనివల్ల 73 శాతం మేర సాగు, దాదాపు 10 లక్షల ఎకరాల్లో ముందస్తు రబీ పంటలు వేసే అవకాశం ఉందని సీఎం అధికారులు చెప్పారు. శెనగ సహా ఇతర విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామని, రబీలో సాగుచేసే శెనగ విత్తనాలపై సబ్సిడీని 25 శాతం నుంచి 40శాతంకు పెంచామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం విత్తనాల పంపిణీ చురుగ్గా సాగుతోందని, సుమారు 1 లక్ష క్వింటాళ్ల శెనగ విత్తనాలు సిద్ధంచేశామని, ఇందులో ఇప్పటికే 45 వేల క్వింటాళ్ల పంపిణీ చేశామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు.

Related News

Select the Topic
Scroll to Top