ఈతరం భారతం శ్రీశైలం జూలై 2 :
నల్లమలలో మూడునెలల పాటూ నో ఎంట్రీ.. అటవీశాఖ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. పెద్ద పులుల సంతానోత్పత్తికి సమయం కావడంతో జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు టైగర్ రిజర్వు ప్రాంతాల్లోకి సందర్శకులను అనుమంతించరు. నల్లమలోని జంగిల్ సఫారీ నిలిపివేశారు.. ఆలయాలకు భక్తుల్ని కూడా అనుమతించరు. పర్యాటకులు, భక్తులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు
ఇప్పుడు పులుల పునరుత్పత్తి సమయం కావడంతో ఎన్టీసీఏ ఆదేశాలతో అడవిలోకి ప్రవేశంపై నిషేధం విధించారు. మూడు నెలల పాటూ అటవీ ప్రాంతంలోని ఆలయాల సందర్శన నిలిపివేశారు, జంగిల్ సఫారీ కూడా ఉండదు. కేవలం బఫర్ ఏరియాలో ఉండే ఎకో టూరిజంలో మాత్రమే విడిదికి అవకాశం ఉంటుంది. భక్తులు, పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని అటవీశాఖ అధికారులు సూచించారు.















