ఈతరం భారతం పుట్టపర్తి ఆంధ్ర ప్రదేశ్ నవంబర్ 20:
ఈరోజు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సతీమణితోకలిసి మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిరిడీని సందర్శించి, శ్రీ షిరిడీ సాయిబాబాను దర్శించుకుని మధ్యాహ్న హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.దర్శనం అనంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు మంత్రి పొంగులేటి దంపతులకు శ్రీ సాయిబాబా ప్రసాదాలు, జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు.















