EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అస్సాంలో జనాభా నిష్పత్తి మారుతోంది        ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ

అస్సాంలో జనాభా నిష్పత్తి మారుతోంది

       ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ

దిస్పూర్ జూలై 17 (ఈతరం భారతం);: అస్సాంలో జనాభా నిష్పత్తి మారుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అస్సాంలో నేడు ముస్లిం జనాభా 40 శాతంగా ఉందని ఆయన తెలిపారు. ‘‘రాష్ట్రంలో జనాభా నిష్పత్తి మారిపోతున్నఅంశం నాకో సమస్యగా తయారయింది. నేడు అస్సాంలో ముస్లింల జనాభా 40 శాతం. 1951లో 12 శాతం మాత్రమే ఉండేది. మనం చాలా జిల్లాలను పోగొట్టుకున్నాం. ఇది నాకు రాజకీయ అంశం కాదు. ఇది నాకు చావో రేవో వంటి సమస్య’’అని ఆయన తెలిపారు.అస్సాంలో మత ఘర్షణలకు కారణం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైనారిటీలే కారణమన్నారు. అస్సాంలో మొత్తం 14 లోక్ సభ సీట్లుండగా, బిజెపి, ఏజిపి, యుపిపిఎల్ సంకీర్ణం 11 సీట్లు గెలుచుకుంది. మిగతా మూడింటిని కాంగ్రెస్ గెలుచుకుంది.

Related News

Select the Topic
Scroll to Top