ఈ భూమి మీద అత్యంత నిరాడంబరం గా
ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ పెండ్లి
12.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల
రోజుకి 500 సంపాదించే కూలీ నుంచి 5000 వేలు సంపాదించే వారైన కూడా తమ ఇంట్లో పెళ్ళి అయితే ఆ..పెండ్లికి కనీసం తమ ఆరునెలల నుంచి, సంవత్సరం సంపాదనయినా ఖర్చు చేస్తారు.!! కొందరయితే అప్పులు కూడా చేస్తారు. కానీ ముఖేష్ అంభానీ మాత్రం కనీసం తన ఈ..ఒక్క రోజు సంపాదన (3,206కోట్లరూపాయలు..) కూడా కొడుకు పెళ్ళి కోసం ఖర్చు చేయట్లేదు…!!
నిజానికి ఈ భూమండలం మొత్తం మీద అత్యంత ఘనంగా జరిగిన/ జరుగుతున్న పెండ్లి అంబానీ కొడుకుదే….!!
కానీ…!! కానీ…!!!! ఆ..ఖర్చు ఈ ఒక్క రోజు రిలయన్స్ షేర్స్ పెరగటం వలన వాళ్లకి వచ్చే ఆదాయం(రూ.3,206కోట్ల) కంటే కూడా తక్కువే మరి..
మరీ ఇంత నిరాడంబరమా..!! కనీసం మీ..ఒక్క రోజు సంపాదన అయినా పూర్తిగా కొడుకు పెండ్లికి ఖర్చు పెట్టకపోతే ఎలా ముఖేష్ అంబానీ జీ..!














