ఎవరెవరు బదిలీ అయ్యారంటే..
తెలంగాణలో 20 మంది అధికారుల బదిలీ తెలంగాణలో మొత్తం 20 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. బదిలీ అయిన వారిలో 13 మంది పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, నలుగురు కలెక్టర్లు, ముగ్గురు ఇతర శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. వీరిలో రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎక్సైజ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ శ్రీదేవి ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్‌కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డితోపాటు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, రంగనాథ సత్యనారాయణ.. సంగారెడ్డి, కామారెడ్డి, జగిత్యాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల్, మహబూబాబాద్, భూపాలపల్లి, నారాయణపేట, సూర్యాపేట ఎస్పీలు రమణకుమార్, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్, కే నర్సింహ, మనోహర్, సృజన, చంద్రమోహన్, కరుణాకర్, వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్‌ను బదిలీ చేసింది.














