పార్టీని వీడుతున్న నేతలు
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో కలిసి వెళ్లకూడదని సమావేశంలో నిర్ణయం తీసుకొన్నామని, అదేవిధంగా కూటమిని ఆమోదించవద్దని దేవెగౌడను కోరుతామని ఇబ్రహీం పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు ప్రకటన వల్ల కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల్లో నేతలు పార్టీని వీడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేస్తామని, సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను ఆ కమిటీ దేవెగౌడకు వివరిస్తుందని తెలిపారు.














