బీహార్ లోని బుక్సర్ జిల్లాలో నార్త్ఈస్ట్ సూపర్‌ఫాస్ట్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు. రైలు ప్రమాద బాధితులకు పది లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ప్రమాద ఘటన పట్ల ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ ప్రమాదం పట్ల బీహార్ సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారిని ఉషా భండారి, ఆకృతి భండారి, అబూ జైద్, నరేంద్రగా గుర్తించారు. ఢిల్లీ నుంచి అస్సాంలోని టిన్సుకియా వెళ్తున్న రైలు బుధవారం రాత్రి రఘునాథ్పుర్ వద్ద పట్టాలు తప్పింది. ఈస్ట్ సెంట్రల్ రైల్వే శాఖకు చెందిన రెస్క్యూ బృందం ప్రమాద స్థలానికి చేరుకున్నది.కాగ బుధవారం రాత్రి 9.53 గంటలకు రఘునాథ్‌పూర్ సమీపంలో ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అస్సాంలోని కామాఖ్య జంక్షన్‌కు వెళ్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని 21 బోగీలు పట్టాలు తప్పాయి ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 70 మంది గాయపడ్డారు. దీంతో స్థానికులతోపాటు రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. క్షతగాత్రులను బ్రహ్మపుర్ దవాఖానకు తరలించారు. ప్రమాదం నేపథ్యంలో 21 రైళ్లను అధికారులు దారిమళ్లించారు.