EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. బావిలో పడిన పికప్ వ్యాన్, 8 మంది మృతి!

ఈతరం భారతం ముంబై జూన్ 14

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తండుల్వాడి వద్ద ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ భారీ బావిలో పికప్ వ్యాన్ అదుపు తప్పి పడిపోవడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ దిగ్భ్రాంతికర ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. అలాగే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ముమ్మరంగా సహాయక చర్యలు

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన యంత్రాంగం సహాయక చర్యలు ప్రారంభించింది. ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పికప్ వ్యాన్‌లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తోందని మంత్రి జయకుమార్ గోరే వెల్లడించారు. ఈ ఘటన అత్యంత దిగ్భ్రాంతికరమని సోలాపూర్ ఎంపీ ప్రణతి షిండే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్రంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు.

Related News

Select the Topic
Scroll to Top