EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

విగ్రహం ఒక్క అంగుళం కూడా కదల్లేదు….

ఈతరం భారతం న్యూఢిల్లీ సెప్టెంబర్ 8:

_______________________________

మరో రెండు సంవత్సరాల్లో ఉజ్జయినిలోని క్షిప్రా నదిలో కుంభమేళా జరగనుంది. ప్రతి పుష్కరానికి జరిగే ఈ వేడుక కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలుపెట్టింది. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి.. నదిలో పుణ్య స్నానాలు ఆచరించనున్నారు. దీంతో పవిత్ర స్నానాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఉజ్జయిని రహదారిని విస్తరిస్తున్నారు. అయితే, ఆ రహదారిపై 170 ఏళ్ల చరిత్ర కలిగిన హనుమంతుడి ఆలయం ఉంది. ఈ ఆలయం తొలగింపు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ పనుల కోసం ప్రాచీన హనుమంతుని ఆలయాన్ని తొలగించారు. అయితే, అందులోని హనుమ విగ్రహాన్ని మాత్రం అక్కడ నుంచి తరలించడం సాధ్యం కాలేదు. నాలుగు రోజుల పాటు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించి, భారీ యంత్రాలతో ప్రయత్నించినా… విగ్రహం ఒక్క అంగుళం కూడా కదల్లేదు. ఈ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చోటుచేసుకుంది. కంఠాల్ చౌరాహా – ఛత్రీ చౌక్ రహదారిపై ఉన్న ‘ఖడే హనుమాన్’ ఆలయానికి దాదాపు 170 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతుంటారు.12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుణ్యకాలంలో క్షిప్రా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు పరమశివుడి క్షేత్రమైన ఉజ్జయినికి తరలివస్తారు. అందులో భాగంగానే రహదారి విస్తరణ చేపట్టగా.. పురాతన ఆలయాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది

ఆలయాన్ని పూర్తి స్థాయిలో తొలగించినప్పటికీ, నిలబడి ఉన్న హనుమంతుని విగ్రహం మాత్రం ఉన్న చోటు నుంచి కదల్లేదు. అధికారులు, కార్మికులు భారీ యంత్రాల (జేసీబీలు, క్రేన్లు) సహాయంతో విగ్రహాన్ని తరలించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. స్థానిక మీడియా నివేదిక ప్రకారం, గత కొద్ది రోజుల్లో నాలుగుసార్లు జరిపిన ప్రయత్నాలు విఫలం కావడంతో, అధికారులు భారీ యంత్రాల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారువిగ్రహాన్ని కదిలించడంలో అధికారులు విఫలమవడంతో ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనేకమంది దీనిని దైవ లీలగా అభివర్ణిస్తున్నారు. అదే సమయంలో ఆలయ ప్రాంగణం వద్దకు పెద్ద ఎత్తున కోతులు గుమిగూడిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో నమ్మకం మరింత బలపడింది.అనేక విధాలుగా ప్రయత్నించిన అధికారులు, పురావస్తు శాఖ, ఇతర నిపుణుల సలహాలు స్వీకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం అధికారులు నిపుణుల నివేదిక కోసం వేచి చూస్తుండగా.. విగ్రహానికి తాత్కాలికంగా షెడ్ ఏర్పాటు చేసి రక్షణగా ఉంచారు.చుట్టుపక్కల ఈ ఘటన తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవైపు అభివృద్ధి, మరొకవైపు విశ్వాసం మధ్య నడుస్తున్న ఈ వివాదంలో విగ్రహానికి ఎలాంటి హాని కలగకుండా అధికారులు దీనిని ఎలా పరిష్కరిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

Related News

Select the Topic
Scroll to Top