EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సంస్కరణల వల్లే మనదేశం అభివృద్ధి చెందుతుంది: చంద్రబాబు  

ఈతరం భారతం న్యూ ఢిల్లీ  మార్చ్ఐ 7:

టీలో భారతీయుల పరిజ్ఞానం అందరికీ తెలిసిందేనని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. డిప్లొమసీ, ప్లెక్సిబిలిటీ విషయాల్లో భారతీయులకు మంచి పేరుందని అన్నారు. ఢిల్లీ ‘రైసినా డైలాగ్ ’ సదస్సుకు సిఎం హాజరయ్యారు.ఈ సందర్భంగా సదస్సులో ఆయన ప్రసంగించారు. మూడు దశాబ్దాల క్రితమే ఐటీ విస్తరణ గురించి చెప్పానని, హైటెక్ సిటీని, సైబరాబాద్ ను అభివృద్ధి చేశానని, తెలియజేశారు. 1995 లో సిఎం అయ్యాక ఐటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని, అమరావతిలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. పెట్టుబడులతో వచ్చేవారికి జాప్యం లేకుండా అనుమతి ఇస్తున్నామని, అనేక విషయాల్లో కేంద్రంతో కలిసి ముందుకెళ్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. సంస్కరణల వల్లే మనదేశం అభివృద్ధి చెందుతుందని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు కనిపిస్తారని, అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని కొనియాడారు. గృహోపకరణాలు సినిమా టిక్కెట్లు అంతర్జాతీయ వార్తలు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా భారత్ దూసుకెళ్తుందని, మనదేశం.. భవిష్యత్తులో అనేక దేశాలకు విద్యుత్ ఇస్తుందని అన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఎపి వాళ్లే ఉన్నారని, ప్రస్తుతం అనేక దేశాల్లో వృద్ధులు పెరుగుతున్నారని అన్నారు. దక్షిణాదిలో సంతానోత్పత్తి రేటు 1.5 శాతమే ఉందని, 30 ఏళ్ల క్రితం కుటుంబనియంత్రణ పాటించాలని చెప్పామని, ఇప్పుడు ఇద్దరు, అంతకంటే ఎక్కువమంది పిల్లలు ఉండాలని చెబుతున్నామని అన్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నవారికి అనేక ప్రయోజనాలు కల్పిస్తామని, భవిష్యత్తులో గ్లోబల్ కమ్యూనిటీకి సేవ చేసే సామర్థ్యం భారత్ కే ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వృద్ధుల సంఖ్య పెరుగుదల, పాపులేషన్ మేనేజ్ మెంట్.. చాలా కీలకమని అన్నారు. ప్రపంచ అత్యుత్తమ కంపెనీల్లో పనిచేసే వారిలో ఎపి వాళ్లే ఎక్కువ అని.. విభిన్నంగా ఆలోచించే వారికోసం అమరావతిలో క్రియేటివ్ సిటీ నిర్మిస్తున్నామని, ఎపి డ్రోన్ సిటీ, ఎరో స్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ నిర్మిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఆరోగ్యరంగంలో పెనుమార్పులు వస్తాయని, త్వరలో డ్రోన్ అంబులెన్స్ లు కూడా వస్తున్నాయని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top