ఈతరం భారతం తిరుపతి మే 19. రిపోర్టర్ మనోజ్ కుమార్ :
తిరుపతి జిల్లాలో మొబైల్ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు 500 ఫోన్లు రికవరీ చేసి అప్పగించారు తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసులు. పోగొట్టుకున్న ఫోన్లను బాధితుల కు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అందజేశారు ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ….. మాట్లాడుతూ 14వ దశలో కోటి పైగా విలువ గల 500 ఫోన్లు రికవరీ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులను అభినందించారు. ఇప్పటికే 13 దశల్లో 10 కోట్ల పై విలువగల 4785 ఫోన్ లను రికవరీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి జీవితంలో కీలక భాగంగా మారిందన్నారు. పొరపాటున ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే సి ఈ ఐ ఆర్ సేవల ద్వారా ఫిర్యాదు నమోదు చేసి తమ ఫోన్లను తిరిగి పొందే అవకాశాన్ని కల్పించామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు,కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు.ప్రజలు తమ మొబైల్ ఫోన్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా ఫోన్ రికవరీ అవకాశాలు పెరుగుతాయి. సైబర్ మోసాలు మరియు డిజిటల్ నేరాల నుండి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ బలమైన పాస్‌వర్డ్లు ఉపయోగించడంతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దు. ప్రజల ఆస్తుల రక్షణకు తిరుపతి జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తున్నారన్నారు.
తిరుపతి సైబర్ క్రైమ్ విభాగం సి.ఐ ఆర్. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్ల ట్రాకింగ్ మరియు రికవరీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మొబైల్ రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ సిబ్బందికి ప్రశంస పత్రాలు ఇచ్చి జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి వెంకటరావు (పరిపాలన) వినోద్ కుమార్ సైబర్ సెల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.



