ఈతరం భారతం తిరుపతి అప్పలాయగుంట జూలై 01.రిపోర్టర్ మనోజ్ కుమార్
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 07.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు చంద్రప్రభ వాహనంపై రాజ దర్బార్ కృష్ణుడు అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు.సా. 5.00 – 05.30 గం.ల మధ్య ఊంజల్ మండపంలోకి శ్రీవారు వేంచేపు చేశారు. సా. 5.30 – 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహించారు.
జూలై 02న రథోత్సవం
జూలై 02న గురువారం ఉదయం 08.45 గం.లకు రథోత్సవం జరుగుతుంది.
వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.




