ఈతరం భారతం తిరుపతి రిపోర్టర్ మనోజ్ కుమార్ జూన్ 18
నగరంలోని చేపల మార్కెట్లో కుళ్ళి దుర్వాసనతో కూడిన చేపలు, రొయ్యలు ఉన్న రెండు దుకాణాలను సీజ్ చేశామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచనలతో, కమిషనర్ ఆదేశాల మేరకు లీలా మహల్ వద్ద గల చేపల మార్కెట్ లో వెటర్నరీ ఆఫీసర్, పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి గురువారం ఉదయం ఆకస్మిక తనిఖీ లు నిర్వహించామని తెలిపారు. తిరుపతి నగరంలోని లీలామహల్ వద్ద గల చేపల మార్కెట్ లో 22 షాపులు ఉన్నాయి. ఇక్కడ కుళ్ళిన చేపలు విక్రాయిస్తున్నట్లు పిర్యాదులు వచ్చాయని తెలిపారు. చేపలు, రొయ్యలను ఫ్రీజర్లలో ఉంచి విక్రాయిస్తున్నారని తెలపడంతో తనిఖీ లు నిర్వహించామని తెలిపారు. ఇందులో షాప్ నంబర్ 9, షాప్ నెంబర్ 10 షాపులలో చెడిపోయినటువంటి నిల్వ ఉంచిన చేపలను, రొయ్యలను గుర్తించామని తెలిపారు.




