EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మన చేతుల్లోనే దాగి ఉన్న ఆరోగ్యం…

చేతుల అపరిశుభ్రత ప్రాణాల మీద తెస్తుందని, డయేరియా, న్యూమోనియా లాంటి వ్యాధులతో ఎంతోమంది చిన్నారులు కన్నుమూస్తున్నారని, సరైన అవగాహన చైతన్యం లేకపోవడం వల్ల, తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని, చిన్న చిన్న జాగ్రత్తలతో వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకునే విసులుబాటు ఉన్నప్పటికీ నిర్లక్ష్యము కారణంగా పరిస్థితిని చేజారి పోతుందని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరీ అన్నారు. అన్నం తినబోయే ముందు, మరుగుదొడ్లు వాడిని అనంతరము, బయటనుంచి ఇంట్లోకి వచ్చిన తర్వాత, చేతుల శుభ్రత విషయంలో నిర్లక్ష్యము చేస్తున్నారని, దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, రకరకాల ప్రమాదకర వ్యాధులను కేవలం చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దూరంగా పెట్టవచ్చు అని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరీ అన్నారు. ఈ సందర్భంగా లిల్లీ మేరీ మాట్లాడుతూ ఈ అలవాటును పాటించడం ద్వారా ఏటా 50 లక్షల మరణాలు తగ్గించవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని, అందరూ చేతిభ్రత పై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని ఆదివారం ప్రపంచ చేతి శుభ్రత దినోత్సవ సందర్భంగా భిన్న అంశాలతో ప్రత్యేక కథనం.

చిన్నపిల్లలతో తస్మాత్ జాగ్రత్త:

పిల్లల్లో న్యూమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులకు ప్రధాన కారణం శుభ్రత పాటించకపోవడం, నెలలు నిండని శిశువులు, అప్పుడే పుట్టిన పిల్లలను తాకేముందు తల్లిదండ్రులు ఇతరులు తప్పనిసరిగా శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా చేతులను సబ్బుతో కడుక్కున తర్వాతే శిశువులను తాకాలి. పిల్లలు, వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అవయవ మార్పిడి చేసుకున్న వారిలో మిగతా వారితో పోలిస్తే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటివారు శుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే తేలికగా వ్యాధులు దాడి చేసేందుకు అవకాశం ఇచ్చినట్టే. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా 25% వరకు న్యూమోనియా ఇతర శ్వాసకోశ వ్యాధులను నివారించవచ్చని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరీ పేర్కొన్నారు.

ఆషామాషీగా వద్దు:

అత్యధికులు చేతి శుభ్రతను ఆషామాషీగా తీసుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి . కేవలం నీటితో కాకుండా సబ్బు, లేదంటే యాంటీ బ్యాక్టీరియల్ లోషన్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. నగరంలో 100% ఇళ్లలో సబ్బు వినియోగంలో ఉంది. స్నానానికి, దుస్తులు ఉతకడానికి, వంటపాత్రలో కడగటానికి వాడుతున్నారు. పాత్రలు కడగటానికి సాధారణంగా 30% కంటే తక్కువ మంది మాత్రమే చేతులను కడుక్కునేందుకు సబ్బు లేదా యాంటీ బ్యాక్టీరియాల్ ఉత్పత్తులు వాడుతున్నారని లిల్లీ మేరీ అన్నారు. మరుగుదొడ్లు ఉపయోగించాక సబ్బుతో చేయి కడుక్కొని ఫలితంగా వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గురవుతున్నారని, ఒకరికి సోకితే మిగతా కుటుంబ సభ్యులకు అది వ్యాపిస్తుందని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరీ పేర్కొన్నారు.

వ్యాధులకు హేతువు:

 మన చెయ్యి ఎన్నో బ్యాక్టీరియా, వైరస్లకు నిలయం. నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమవుతుంటాము. రకరకాల వస్తువులను తాకుతుంటాము. మరుగుదొడ్లను వినియోగిస్తుంటాము. ఈ క్రమంలో అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్లు, చేతి వేళ్ళు, ముంచేయి గోళ్ళలో, నివాసమును ఏర్పాటు చేసుకుంటాయి. ఎప్పటికప్పుడు సబ్బు లేదా యాంటీ బ్యాక్టీరియాలోషన్ తో శుభ్రం చేసుకోవాలి. అలా కాకుండా అవే చేతులతో నోరు, కళ్ళు, ముక్కు, పెదవులను తాకటం వల్ల వ్యాధుల సోకే ప్రమాదం ఉంది. ప్రధానంగా వ్యక్తిగత శుభ్రత పాటించనందునే డయేరియా, న్యూమోనియా, టైఫాయిడ్ కలరా స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులు నగరంలో పెరుగుతున్నాయి. వైరస్ బ్యాక్టీరియా క్రిములు ఇoదుకు కారకాలు. ఒకరి నుంచి వేరొకరికి వేగంగా ఇవి విస్తరిస్తాయి. స్వైన్ ఫ్లూ తో బాధపడే వారు తుమ్మి నా, దగిన ఆ వైరస్ సమీపంలో ఉండే వస్తువుల పైకి చేరుతుంది. అక్కడ చేతులు వేసిన సమయంలో శరీరంలోకి చేరుతుంది. ఇక ఆహారం తినడానికి ముందు, వడ్డించేటప్పుడు, చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే చేతిలో వైరస్ ఉంటే ఆహార పదార్థాల మీద వ్యాపించిం, అతిసారము లాంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ఇవి వాడాలి:

ఈ సందర్భంగా లిల్లీ మేరీ మాట్లాడుతూ చేతుల శుభ్రతకు నీళ్లు, సబ్బు, శానిటైజర్ల వాడకంతో బ్యాక్టీరియా క్రిములను 60 శాతం వరకు తొలగించే అవకాశం ఉంది. అలాగే రసాయనాలు ఎక్కువగా లేని సభ్యులు వినియోగించి చేతులు కడుక్కోవడం మంచిది. సున్నిపిండి, పసుపు, వేడి నీళ్లు, నిమ్మకాయ రసం మిశ్రమము, కలబంద, తేయాకు, పొద్దుతిరుగుడు నూనెలతో తయారైన శానిటైజర్లు వాడితే చాలా మంచిదని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరీ తెలిపారు.

 

Related News

Select the Topic
Scroll to Top