EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పాక్ లో భూకంపం .. తప్పించుకున్న 200లకు పైగా ఖైదీలు  

న్యూ డిల్లీ జూన్ 3 (ఈతరం భారతం);పాకిస్థాన్‌లోని బఛా జైలు పరిసర ప్రాంతంలో భూకంపం రావడంతో 200లకు పైగా ఖైదీలు తప్పించుకున్నారు. సోమవారం ఇక్కడ మూడుసార్లు భూమి కంపించింది. దీంతో జైలులోని కొన్ని గోడలకు పగుళ్లు రాగా.. కొన్ని కూలిపోయాయి. ఈ క్రమంలో 600 నుంచి వెయ్యి మంది ఖైదీలను బ్యారక్‌ల నుంచి వేరే ప్రాంతానికి అధికారులు తరలిస్తుండగా.. ఖైదీలు తప్పించుకున్నారు పలువురు అధికారుల వద్ద ఉన్న తుపాకులు తీసుకొని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక ఖైదీ మృతి చెందగా.. నలుగురు అధికారులు గాయపడ్డారు.ఖైదీల పరారీతో అప్రమత్తమైన అధికారులు తిరిగి ఖైదీలను పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ 80 మందిని పట్టుకున్నామని.. అందుకు స్థానికుల సహాయం తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ జైలులో ఎక్కువ శాతం మాదకద్రవ్యాల సంబంధిత కేసుల్లోని నేరస్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని మరో అధికారి తెలిపారు. పారిపోయిన వారిలో డ్రగ్స్ నేరస్థులు, మానసికంగా సరిగా లేని వారే అని ఎక్కవ ఉన్నారన్నారు.

Related News

Select the Topic
Scroll to Top