ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ ఏప్రిల్ 13
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి వద్ద రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. హర్మూజ్‌ను పూర్తిగా దిగ్బంధిస్తామని అమెరికా హెచ్చరించడం, సోమవారం నుంచి ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తామని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో భారత్ చేరుకోవాల్సిన 15 నౌకలు ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయాయి. వీటిలో ప్రధానంగా ఎల్ఎన్జీ (LNG), ఎల్పీజీ (LPG) క్యారియర్లు, క్రూడాయిల్ ట్యాంకర్లతో పాటు ఒక కెమికల్ కంటైనర్ ఉన్నట్లు సమాచారం.జలసంధిలో నిలిచిపోయిన భారత నౌకలను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. పర్షియన్ గల్ఫ్ సమీపంలో నౌకాదళానికి చెందిన ఆరు యుద్ధ నౌకలను ఇప్పటికే మోహరించారు. ఈ మార్గంలో ప్రయాణించాల్సిన మొత్తం 25 భారత నౌకల్లో 10 నౌకలు ఇప్పటికే సురక్షితంగా జలసంధిని దాటగా, మిగిలిన 15 నౌకలను క్షేమంగా తీసుకువచ్చేందుకు నావీ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. అమెరికా ప్రకటనతో అంతర్జాతీయ నౌకల రాకపోకలు అకస్మాత్తుగా తగ్గిపోయాయి.




