EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

హమాస్‌, ఇజ్రాయెల్‌ హింసాకాండకు అమెరికా మిడిల్‌ ఈస్ట్‌ వైఫల్యమే కారణం

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తాజాగా స్పందించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న హింసాకాండకు అమెరికా మిడిల్‌ ఈస్ట్‌ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఇజ్రాయెల్‌-పాలస్తీనాల మధ్య హింస చెలరేగడానికి అమెరికా పాలసీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అదేవిధంగా పాలస్తీనియన్ల ప్రయోజనాలను యునైటెడ్‌ స్టేట్స్‌ విస్మరించిందని విమర్శించారు. ఇక ఇదే సందర్భంలో ఇజ్రాయెల్‌-పాలస్తీనా అంశంపై కూడా పుతిన్‌ మాట్లాడారు. ‘స్వతంత్ర సార్వభౌమ’ పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాల్సిన ‘అవసరం’ ఉందని అభిప్రాయపడ్డారు. ‘మిడిల్‌ ఈస్ట్‌లో అమెరికా పాలసీ వైఫల్యానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. చాలా మంది ప్రజలు నా అభిప్రాయంతో ఏకభవిస్తారని నేను భావిస్తున్నాను. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి అంతర్జాతీయ ప్రయత్నాలకు ఆధిపత్యం వహించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇరువైపులా ఆమోదయోగ్యమైన రాజీ కుదర్చడంలో వాషింగ్టన్‌ పూర్తిగా విఫలమైంది’ అని పుతిన్‌ ఆరోపించారు. ఇక రష్యా ఇరు దేశాలతో (ఇజ్రాయెల్‌, హమాస్‌) టచ్‌లో ఉందని, సమస్యను పరిష్కరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ గత శనివారం మెరుపు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇజ్రాయెల్‌ సైతం హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. దీంతో దాడులు, ప్రతి దాడులతో రెండు దేశాల భూభాగాలు దద్దరిల్లుతున్నాయి. ఇరు దేశాల్లో వీధులు రక్తంతో తడిసిపోయాయి. గత ఐదు రోజుల్లో దాదాపు 3,500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ చూసిన గుట్టలు గుట్టలుగా పడి ఉన్న మృతదేహాలతో రెండు ప్రాంతాలు భయానకంగా మారిపోయాయి. క్షతగాత్రుల రోదనలతో యుద్ధ ప్రాంతాలు హృదయవిదారకంగా దర్శనమిస్తున్నాయిను

Related News

Select the Topic
Scroll to Top